: ఉ.కొరియా ఇటువంటి చర్యలకు మళ్లీ దిగితే కఠిన చర్యలు తప్పవు: ఐక్యరాజ్య స‌మితి

ప్ర‌పంచ దేశాల నుంచి ఒత్తిడి వ‌స్తున్న‌ప్ప‌టికీ ఎవ్వ‌రి మాటా విన‌కుండా అణ్వాయుధ ప‌రీక్ష‌లు చేసుకుంటూ వెళుతున్న ఉత్త‌ర కొరియాను ఐక్య‌రాజ్య స‌మితి హెచ్చ‌రించింది. ఇటువంటి చర్యల వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. ప్రపంచ ప్రజలు అభద్రతా భావానికి గుర‌వుతార‌ని చెప్పింది. ఉత్త‌ర‌ కొరియాకు సమస్యలు ఉంటే శాంతియుత, దౌత్యపర, రాజకీయ పరిష్కార మార్గాల ద్వారా ముందుకు వెళ్లాల‌ని పేర్కొంది.

ఉత్త‌ర‌ కొరియా నిర్వ‌హిస్తోన్న అణు ప‌రీక్ష‌లు ఆపేయాల‌ని, తన వద్దనున్న న్యూక్లియర్‌ వెపన్స్‌ని నిర్వీర్యం చేయాలని సెక్యూరిటీ కౌన్సెల్‌ ఆదేశించింది. అంతేగాక ఉత్త‌ర కొరియా మ‌రో క్షిప‌ణి ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన నేప‌థ్యంలో జపాన్‌, దక్షిణ కొరియాలు ఐక్య‌రాజ్య‌ సమితిని సంప్రదించి, భద్రతా మండలిని సమావేశ పరచి ఉత్త‌ర‌కొరియాపై చ‌ర్య‌లు తీసుకోవాలని కోరాయి.

More Telugu News