bellamkonda srinivas: పొలాచ్చి యాక్షన్ సీన్స్ లో పూజా హెగ్డే!

'లక్ష్యం' .. 'లౌక్యం' .. 'డిక్టేటర్' వంటి సినిమాలను తెరకెక్కించిన శ్రీవాస్, ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'పొలాచ్చి'లో జరుగుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ .. పూజా హెగ్డే .. జగపతిబాబు .. శరత్ కుమార్ .. వెన్నెల కిషోర్ తదితరులు పాల్గొనగా యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

15 రోజుల పాటు ఇక్కడ యాక్షన్ సీన్స్ నే చిత్రీకరించనున్నారు. పీటర్ హెయిన్స్ అధ్వర్యంలో ఈ పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఆ తరువాత షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారట. 'జయ జానకి నాయక' హిట్ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ .. 'దువ్వాడ జగన్నాథం' సక్సెస్ తరువాత పూజా హెగ్డే చేస్తోన్న సినిమా ఇది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమా కూడా హిట్ కొడుతుందేమో చూడాలి మరి.       
bellamkonda srinivas
pooja hegde

More Telugu News