: భార్య చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహేష్ భూపతి... ఏం చేసిందో చూడండి!
దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై మహా నగరాన్ని వరుణుడు అతలాకుతలం చేస్తున్న వేళ, సామాన్య జన జీవనం అస్తవ్యస్తం కాగా, ఆ ప్రభావం ప్రముఖులు, వీఐపీలపైనా పడింది. భారత మాజీ టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి, అతని భార్య లారా దత్తా కూడా వర్ష బాధితులుగా మిగిలారు. అయితే, వర్షాలు కురుస్తున్న సమయంలో లారా దత్తా చేసిన ఓ పని మహేష్ భూపతికి కోపం తెప్పించింది.
ఇంట్లోకి వరద నీరు వస్తుండటంతో మహేష్ భూపతి గతంలో గ్రాండ్ శ్లామ్ పోటీల్లో పాల్గొన్న వేళ వాడిన టవల్స్ ను అడ్డుగా పెట్టి, వాటిని ఫోటో తీసి, తన ట్విట్టర్ ఖాతాలో పెడుతూ, వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ టవల్స్ తనకు ఇలా ఉపయోగపడ్డాయంటూ ఆమె వ్యాఖ్యానించింది. దీనిపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన మహేష్, అవన్నీ తన ఎన్నో సంవత్సరాల శ్రమకు ఫలితమని, తననేమైనా ఆటపట్టిస్తున్నావా? అని కాస్తంత గట్టిగానే బదులిచ్చాడు. గ్రాండ్ శ్లామ్ పోటీల్లో తన ఆటకు గుర్తుగా వాటిని మధుర జ్ఞాపకాలుగా మహేష్ చూసుకుంటున్నాడట. ఇక అటువంటి వాటిని వర్షం నీటికి అడ్డుగా పెడితే కోపం రాదా మరి?