: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సంచలనం సృష్టించి విండీస్.. ఇంగ్లండ్‌పై చారిత్రక విజయం!


ఇంగ్లండ్‌తో హెడింగ్లీలో జరిగిన రెండో టెస్ట్‌లో విండీస్ చారిత్రక విజయం సాధించింది. ఎవరూ ఊహించని రీతిలో 322 పరుగుల విజయ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి క్రీడా పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసిన విండీస్ 17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో తొలిసారి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. 2000 సంవత్సరం తర్వాత ఇంగ్లండ్‌లో విండీస్ సాధించిన తొలి విజయమిది.

ఓవర్ నైట్ 5/0తో ఐదో రోజైన మంగళవారం ఆటను ప్రారంభించిన పర్యాటక విండీస్ జట్టు భారీ లక్ష్యం కళ్లముందు కనబడుతున్నా తడబాటు పడకుండా జాగ్రత్తగా ఆడింది. షై హోప్ (118) అజేయ శతకంతోపాటు బ్రాత్‌వైట్ (95) పోరాట పటిమతో విండీస్ అలవోక విజయం సాధించింది. హోప్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. కాగా, విండీస్‌కు భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉన్నా 322 పరుగులు చాలా ఎక్కువని భావించిన ఇంగ్లండ్ డిక్లేర్ చేసి తన కొంపను తానే కూల్చుకుంది.

  • Loading...

More Telugu News