mahesh babu: 'భరత్ అను నేను'కు భారీ ఆఫర్?

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా 'భరత్ అను నేను' సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగును పూర్తిచేసుకుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే .. ప్రపంచవ్యాప్తంగా థియేటర్ హక్కులను అవుట్ రేట్ కు ఇవ్వమంటూ భారీ ఆఫర్లు వస్తున్నట్టుగా తెలుస్తోంది.

 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ హక్కులు ఎంత లేదన్నా 80 కోట్లు పలికే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తమిళ .. కర్ణాటక .. హిందీ .. ఓవర్సీస్ హక్కులు కలుపుకుని, ఓ 40 కోట్ల వరకూ ఉండొచ్చని చెబుతున్నారు. ఈ లెక్కలన్నీ వేసుకుని ఈ సినిమాను అవుట్ రేట్ గా 115 కోట్లకి కొనుగోలు చేయడానికి పెద్ద సంస్థలు రెడీగా వున్నాయట. అయితే ఈ ఆఫర్స్ పై నిర్మాత దానయ్య ఇంకా ఏ నిర్ణయము తీసుకోలేదని అంటున్నారు.  
mahesh babu

More Telugu News