: కాకినాడ ఎన్నికల్లో 'నోటా' ఆప్షన్ లేకపోవడంపై ఎన్నికల సంఘం వివరణ

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 'నోటా (పై ఎవరికీ కాదు)' ఆప్షన్ లేకపోవడంపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ఇవి స్థానిక సంస్థల ఎన్నికలైనందునే నోటా ఆప్షన్ ను పెట్టలేదని తెలిపింది. నోటా ఆప్షన్ కేవలం పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకే పరిమితమని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నోటాను ప్రవేశపెట్టాలంటే... చట్ట సవరణ అవసరమని తెలిపింది. కాకినాడ ఎన్నికల్లో నోటా లేకపోవడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. నోటా లేకపోవడంతో ఎన్నికలను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఈసీని కోరింది. ఈ నేపథ్యంలో, ఎన్నికల సంఘం ఈ అంశంపై స్పష్టతనిచ్చింది. 

More Telugu News