vishal: విశాల్ కి బర్త్ డే కానుక: ట్రిబ్యూట్ సాంగ్ విడుదల

షార్ట్స్‌లో చూడండి
కోలీవుడ్ అగ్రకథానాయకులలో విశాల్ ఒకరు. మొదటి నుంచి కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చే కథాంశాలను ఎంచుకుంటూ .. తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలతో అభిమానులను మెప్పించిన ఆయన, ఈ రోజున పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, సంగీత దర్శకుడు ఇషాన్ దేవ్ .. విశాల్ కి ట్రిబ్యూట్ గా విశాల్ యాంథమ్ అనే సాంగ్ ను రూపొందించి, సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. మురుగన్ మణిరత్నం రాసిన ఈ పాటను నిఖిల్ .. ఇషాన్ దేవ్ కలిసి ఆలపించారు. ఇప్పుడు ఈ సాంగ్ విశాల్ అభిమానులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం విశాల్ 'తుప్పరివాలన్' మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.     
Go Back to Shorts
vishal

More Telugu News