: 25 ఏళ్ల తరువాత స్మగ్లర్ వీరప్పన్ ప్రధాన అనుచరుడి అరెస్టు!
కరుడు గట్టిన అడవిదొంగ, గంధపు చెక్కల స్మగ్లర్, కిల్లర్ వీరప్పన్ ప్రధాన అనుచరుడిని 25 ఏళ్ల తరువాత కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని రామాపుర పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని సత్యమంగళ తాలుకా నివాసి శివస్వామి అలియాస్ డబుల్ గుండి (52) 25 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇతనిపై 1992లో మైనింగ్ వ్యాపారి సంపగి రామయ్య కుమారుడు రామమూర్తిని కిడ్నాప్, కర్ణాటక మాజీ మంత్రి చిన్నగౌడర్ కిడ్నాప్, హత్య, 1993లో హాలార్ మందుపాత పేలుడుతో పాటు అనేక కేసులున్నాయి.
ఈ కేసుల్లో ప్రధాన నిందితుడైన శివస్వామి 25 ఏళ్లుగా ఎవరికీ కంటబడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో తమిళనాడులోని ఈ రోడ్ జిల్లాలోని డిజి.పుదురు గ్రామంలో అజ్ఞాతజీవితం గడుపుతున్నాడన్న సమాచారంతో పోలీసులు శివస్వామిని అరెస్టు చేశారు. అనంతరం న్యాయమూర్తి అనుమతితో విచాతన నిమిత్తం శివస్వామిని కర్ణాటకలోని చామరాజనగర జిల్లాకు తీసుకు వచ్చారు.