ntr: ఎన్టీఆర్ బాగా చేస్తున్నాడు.. నాగార్జున అభినందనలు!

సినిమా కోసం తెరపై నటించడం వేరు .. టీవీ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించడం వేరు అన్నారు నాగార్జున. కథానాయకుడిగా ఎన్నో సినిమాలు చేసిన నాగార్జున, 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అందువలన టీవీ వ్యాఖ్యాతగా ప్రేక్షకులను మెప్పించడం ఎంత కష్టమన్నది తనకి తెలుసునని నాగార్జున అన్నారు.

 తాను 'బిగ్ బాస్' షో చూస్తున్నాననీ, ఎన్టీఆర్ చాలా బాగా చేస్తున్నాడని చెప్పారు. ఎన్టీఆర్ బయట ఎంత ఎనర్జీతో ఉంటాడో .. బుల్లితెరపై కూడా అంతే ఎనర్జీతో కనిపిస్తున్నాడని అన్నారు. ఎంతో కష్టమైన పనిని ఎన్టీఆర్ తనదైన స్టైల్లో అవలీలగా చేస్తుండటం తనకి ఆనందాశ్చర్యాలను కలిగిస్తోందని చెప్పారు. ఎంతో సమయస్ఫూర్తితో .. సమర్థతతో ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తోన్న తీరు అభినందనీయం అంటూ ఆయన ప్రశంసలు కురిపించారు.      
ntr
nagarjuna

More Telugu News