: మిగతా 1,37,458 రేప్ కేసుల సంగతేంటి?: గౌతమ్ గంభీర్
డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కు అత్యాచార కేసులో 20 సంవత్సరాల శిక్షను విధిస్తూ, సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ ఇచ్చిన తీర్పును ఎంతో మంది స్వాగతించారు. భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఈ తీర్పును మహిళా విజయంగా అభివర్ణించాడు. ఎన్సీఆర్బీ 2015 గణాంకాల ప్రకారం, దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో 1,37,458 రేప్ కేసుల విచారణ సాగుతోందని గుర్తు చేశాడు. ఆ కేసుల సంగతేంటని, వాటిని కూడా పరిష్కరించాలని అన్నాడు. ఇందుకోసం న్యాయస్థానాలు కృషి చేయాలని సూచించాడు.