: నిషేధం తర్వాత కూడా ఏ మాత్రం వన్నె తగ్గని టెన్నిస్ అందం.. తొలి మ్యాచ్ లోనే ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించిన వైనం!
మరియా షరపోవా... అసమాన ఆటతీరే కాదు, అద్భుతమైన అందం కూడా ఆమె సొంతం. ఆమె ఆడుతోందంటే స్టేడియం కిటకిటలాడిపోవాల్సిందే. అయితే, డోపింగ్ టెస్టులో పట్టుబడ్డ ఆమె 15 నెలల నిషేధానికి గురయింది. నిషేధం అనంతరం యూఎస్ ఓపెన్ టోర్నీ బరిలోకి దిగిన ఆమె... తనదైన శైలిలో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. తొలి మ్యాచ్ లోనే రెండో సీడ్ సిమోనా హలెప్ ను 6-4, 4-6, 6-3 తేడాతో ఓడించింది.
భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్ లో హలెప్ ను షరపోవా మట్టికరిపించింది. తీవ్ర ఒత్తిడికి లోనైన హలెప్ మ్యాచ్ పై పట్టు కోల్పోయింది. మ్యాచ్ అనంతరం షరపోవా మాట్లాడుతూ, గెలవాలనే పట్టుదలతోనే బరిలోకి దిగానని... అంచనాలకు మించి రాణించాననే ఆనందం తనకు కలిగిందని తెలిపింది.