: నేను దైవాంశ సంభూతుడిని...అందుకే 17 ఏళ్లకే నాకు పెళ్లి చేశారు!: గుర్మీత్ బాబా ఉవాచ


తనను తాను దైవాంశ సంభూతుడిగా ప్రకటించుకున్న రాక్ స్టార్ బాబా తన పుట్టుక, ఇతర విషయాల గురించి ఇటీవలే జరిగిన తన 50వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఒక హిందీ ఛానెల్ తో పంచుకున్నారు. దాని వివరాల్లోకి వెళ్తే... గుర్మీత్ రాం రహీం సింగ్ తల్లిదండ్రులు డేరా సచ్చాసౌధా అనుచరులు. వివాహానంతరం సంతాన భాగ్యం లేకపోవడంతో అప్పటి డేరా అధినేత త్రివేణి దాస్ ను గుర్మీత్ తల్లిదండ్రులు కలిశారు. తమకు వివాహమై 18 ఏళ్లయినా సంతానభాగ్యం లేదని, తమకు ఏదో దారి చూపించాలని వేడుకున్నారు.

దీంతో ఆయన ఓ షరతు మీద సంతానం ప్రసాదిస్తానని చెప్పారు. పుట్టిన బిడ్డను 23 ఏళ్ల తరువాత డేరాకు ఇచ్చేయాలని సూచించారు. కేవలం 23 ఏళ్ల వరకే కుటుంబంతో కలిసి ఉంటాడని, ఆ తరువాత అతడు దైవం నిర్దేశించిన కార్యంలో భాగస్థుడు కావాల్సి ఉంటుందని, అందుకే అతడిని డేరాకు అప్పగించాలని సూచించారని గుర్మీత్ తెలిపారు. అందుకే తన తల్లిదండ్రులు తనకు 17 ఏళ్లకే వివాహం చేశారని ఆయన తెలిపారు. ముందే చెప్పినట్టు తనకు 23 ఏళ్ల వయసు వచ్చేసరికి త్రివేణిదాస్ తనకు డేరా బాధ్యతలు అప్పగించారని గుర్మీత్ తెలిపారు. 

  • Loading...

More Telugu News