: ఎత్తుకు పై ఎత్తు... పార్టీ నుంచి శశికళ, దినకరన్ సస్పెన్షన్!


తమిళనాట అన్నాడీఎంకేలో ఎత్తుకు పైఎత్తుల రాజకీయం జరుగుతోంది. జయలలిత మరణానంతరం పార్టీలో అప్పట్లో చోటుచేసుకున్న పరిణామాల వంటివి మరోసారి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తన మద్దతుదారులైన 22 మంది ఎమ్మెల్యేలతో రిసార్టులో కూర్చున్న టీటీవీ దినకరన్ ఏ క్షణమైనా పార్టీని అధికారంలోంచి దించేస్తానని, తనవైపు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం దీటుగా స్పందించారు.

తమిళనాడులోని రొయపెట్టా వేదికగా జరిగిన సర్వసభ్య సమావేశంలో పార్టీ చీఫ్ పదవి నుంచి వీకే శశికళను బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. అంతే కాకుండా పార్టీ చీఫ్ గా శశికళ జైలుకు వెళ్లకముందు చేపట్టిన పార్టీ నియామకాలన్నిటిని రద్దు చేశారు. శశికళతో పాటు ఆమె మేనల్లుడు టీటీవీ దినకర్‌ ను కూడా పార్టీలోని అన్ని పదవుల నుంచి బహిష్కరిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. అంతే కాకుండా తమిళనాట అత్యంత ప్రజాదరణ కలిగిన జయ టివీతో పాటు నమతు ఎంజీఆర్ మేగజీన్‌ లను కూడా ఇకపై పార్టీ నిర్వహిస్తుందని ప్రకటించారు. దీంతో పన్నీరు సెల్వం పట్టిన పంతాన్ని నెగ్గించుకున్నట్టైంది. దీనిపై దినకరన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News