: చంద్రబాబేమైనా హిట్లరా? ఆయన ఏది మాట్లాడినా చెల్లుతుందా?: ముద్రగడ

మేమేమైనా ఉగ్రవాదులమా? ఇచ్చిన హామీలను అమలు చేయమని అడగడమే తప్పా? అంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమైనా హిట్లరా, ఆయన ఏం మాట్లాడినా చెల్లుతుందా? అని ప్రశ్నించారు. సొల్లు ఉపన్యాసాలతో చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. తమ జాతికి ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని... రిజర్వేషన్లను సాధించేంత వరకు తాము వెనకడుగు వేయమని చెప్పారు.

ఎవరికీ లేని ఆంక్షలు తమ పాదయాత్రకు విధించారని... ఎవరి అనుమతి తీసుకుని గతంలో చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లారని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో అభివృద్ధి వల్ల టీడీపీ గెలవలేదని... డబ్బు, అధికార దుర్వినియోగంతోనే గెలిచిందని చెప్పారు. ఈ నెల 30న అన్ని జిల్లాల కాపు నేతలతో సమావేశం నిర్వహించి... పాదయాత్రతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. 

More Telugu News