: భావన నియోజక వర్గం ఉప ఎన్నికలో ఆమ్‌ఆద్మీ పార్టీ విజయం
ఈ నెల 23న ఢిల్లీలోని భావన నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి వేద్ ప్రకాశ్‌పై 24 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి రామ్ చంద్ర విజయం సాధించారు. ఆ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే, ఆప్ నేత వేద్ ప్రకాశ్ బీజేపీలో చేరి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ నియోజక వర్గానికి ఎన్నిక జరిగింది. ఈ సారి వేద్ ప్రకాశ్ బీజేపీ నుంచి పోటీ చేశారు. ఈ నియోజక వర్గంలో బీజేపీ రెండో స్థానాన్ని, కాంగ్రెస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి.