హీరోయిన్ విషయంలోనే 'హలో' లేట్ అయిందన్న నాగ్!
కథానాయిక ఎంపిక విషయంలో ఆలస్యం కావడం .. షూటింగుపై ప్రభావం చూపిందని అన్నారు. 'గీతాంజలి'లో గిరిజలా .. 'ఏం మాయ చేశావే'లో సమంతాలా కథానాయిక కొత్తగా అనిపించాలనే ఉద్దేశంతో, చాలామంది కథానాయికల పేర్లను పరిశీలించినట్టు చెప్పారు. చివరికి దర్శకుడు ప్రియదర్శన్ కూతురు 'కల్యాణి'ని కథానాయికగా తీసుకోవడం జరిగిందని అన్నారు. టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందనీ .. సినిమా కూడా అదే స్థాయిలో యూత్ కి కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పారు.