: వైసీపీకి పరాభవం తప్పదు.. కాకినాడలో కూడా నంద్యాల ఫలితమే రిపీట్ అవుతుంది: గంటా
నంద్యాల ఉప ఎన్నికలో వచ్చిన ఫలితమే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు జోస్యం చెప్పారు. నంద్యాల గెలుపు సందర్భంగా విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నంద్యాల ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను విని, ప్రజలు భయపడిపోయారని అన్నారు. 14 రోజులపాటు నంద్యాలలోనే మకాం వేసి, ప్రజలను మభ్యపెట్టేందుకు జగన్ ప్రయత్నించారని... అయినా ఆయనను ప్రజలు నమ్మలేదని ఎద్దేవా చేశారు. 2019లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని అన్నారు. జగన్ మానసిక పరిస్థితి ఏంటో ప్రజలకు అర్థమయిందని చెప్పారు.