balakrishna: అనుభవంతో రాసుకున్న డైలాగ్ అది : పూరీ జగన్నాథ్

షార్ట్స్‌లో చూడండి
పూరీ జగన్నాథ్ సినిమాలు హిట్ అయినా .. ఫ్లాపైనా హీరో క్యారెక్టరైజేషన్ ప్రేక్షకుల మనసుపై చెరగని ముద్ర వేస్తుంది. అంతగా ఆయన ఆ పాత్రను తీర్చిదిద్దుతారు. ఇక హీరో చెప్పే డైలాగ్స్ విషయంలోను ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఆ డైలాగ్స్ జనం నోళ్లలో నానేలా చూసుకుంటారు. అలా 'పైసా వసూల్' సినిమాలో " రామకృష్ణ థియేటర్ సందులో తిరిగాను .. మనది నేల టికెట్ బ్యాచ్ " అనే డైలాగ్ తనకి బాగా నచ్చిందని పూరీ అన్నారు.

ఈ డైలాగ్ తన అనుభవంలో నుంచి వచ్చిందని చెప్పారు. తాను రామకృష్ణ థియేటర్ సందులో తిరుగుతూ .. నేల టికెట్లు కొనుక్కుని సినిమా చూసేవాడినని అన్నారు. ఇక బాలకృష్ణ వంటి క్రమశిక్షణ కలిగిన .. నిర్మాతల కష్టం గురించి ఆలోచించగలిగిన హీరోను తాను చూడలేదని చెప్పారు. ఈ సినిమా బాలకృష్ణ కెరియర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు. 
Go Back to Shorts
balakrishna
shriya

More Telugu News