: నంద్యాల ప్రజలారా! కృతఙ్ఞతలు: నారా లోకేశ్
నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంపై ఏపీ మంత్రి, ఆ పార్టీ నేత నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా లో వరుస ట్వీట్లు చేశారు. ‘టీడీపీ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఫలితం నంద్యాల ఉపఎన్నిక ఫలితం. నారా చంద్రబాబు నాయుడు ప్రజల నేత. అభివృద్ధిపై తమ నమ్మకాన్ని కనబర్చిన నంద్యాల ప్రజలకు కృతఙ్ఞతలు. అదేవిధంగా, వైసీపీ క్రిమినల్ పాలిటిక్స్ కు నంద్యాల ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారు. ప్రతి టీడీపీ కార్యకర్తకు నా ధన్యవాదాలు’ అని లోకేశ్ పేర్కొన్నారు.