: 'నంద్యాల జేజమ్మ.. ఇక్కడ ఏ పశుపతి ఆటలు సాగవ్'.. వైరల్ అవుతున్న అఖిలప్రియ పోస్టర్


నంద్యాల ఉప ఎన్నికలో ఘన విజయం దిశగా టీడీపీ దూసుకుపోతోంది. ఈ విజయం కోసం ఎంతోమంది పార్టీ నేతలు కృషి చేసినప్పటికీ... అందరికంటే ఎక్కువ క్రెడిట్ మాత్రం మంత్రి భూమా అఖిలప్రియకే దక్కుతుంది. చిన్న వయసులోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికలను ఆమె ముందుండి ఎదుర్కొన్నారు. తన తల్లిదండ్రుల ఆశయాలను, టీడీపీ అభివృద్ధి మంత్రాన్ని కలబోసి, ఓటర్లను ఆకట్టుకోవడంలో ఆమె విజయం సాధించారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో ఆమె ఫొటోతో ఏర్పాటు చేసిన పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'అరుంధతి' సినిమాలో నటి అనుష్క (జేజమ్మ) వేషధారణలో ఉన్న అఖిలప్రియ ఫొటోను ఈ పోస్టర్ లో ముద్రించారు. 'నంద్యాల జేజమ్మ.. ఇక్కడ ఏ పశుపతి ఆటలు సాగవ్' అనే హెచ్చరికను పోస్టర్ పై ముద్రించారు. 

  • Loading...

More Telugu News