: ఇంత ఆధిక్యం ఇక తగ్గదు... విజయం భూమాదే!: ఒప్పేసుకున్న శిల్పా
భూమా బ్రహ్మానందరెడ్డి దాదాపు 20 వేల ఓట్లకు పైగా మెజారిటీలో కొనసాగుతున్న నేపథ్యంలో, ఇంత ఆధిక్యం తగ్గడం సాధ్యం కాదని వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని, భూమా నాగిరెడ్డి చనిపోయిన తరువాత ప్రజల్లో ఏర్పడిన సానుభూతి కూడా ఇంత మెజారిటీకి కారణమని తాను భావిస్తున్నట్టు తెలిపారు. దీనికితోడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ అక్రమాలు చేసిందని, విచ్చలవిడిగా డబ్బును పంచారని ఆరోపించారు. ఆ ప్రభావంతోనే భూమా బ్రహ్మానందరెడ్డి గెలుస్తున్నారని అన్నారు. నంద్యాల పట్టణంలో జరిగిన అభివృద్ధి పేరిట తెలుగుదేశం ప్రచారం చేసినా, ఆ వాదనను తాను అంగీకరించబోనని శిల్పా వ్యాఖ్యానించారు. తాను 28 రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లలేదని గుర్తు చేశారు.