shriya: కొత్త హీరోయిన్స్ కి కంగారు పుట్టిస్తోన్న శ్రియ!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై శ్రియ సుదీర్ఘ కాలంగా తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తోంది. తమిళంలోను ఆమె స్టార్ హీరోల సరసన సందడి చేసింది. అలాంటి శ్రియ .. సీనియర్ హీరోల సరసన వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఒకప్పుడు తాను చేసిన స్టార్ హీరోల సరసనే ఆమె మళ్లీ ఛాన్సులు సంపాదించుకుంటూ ఉండటం విశేషం.

మనం .. గౌతమీ పుత్ర శాతకర్ణి .. పైసా వసూల్ .. ఇలా శ్రియ వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. తెరపై ఆమెను చూసిన వాళ్లంతా గ్లామర్ ఎంత మాత్రం చెక్కు చెదరలేదనే ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా 'పైసా వసూల్' వేడుకకు హాజరైన శ్రియ .. అందరి దృష్టిలోను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఫంక్షన్ కి వచ్చిన ముస్కాన్ .. ఖైరా దత్ కంటే గ్లామర్ పరంగా శ్రియ ఎక్కువగా ఆకట్టుకుందని అంటున్నారు. మొత్తానికి శ్రియ గ్లామర్ పరంగా కొత్త కథానాయికలకు కంగారు పుట్టిస్తోందని చెప్పుకుంటున్నారు.   
Go Back to Shorts
shriya

More Telugu News