: అంత్యక్రియలను నిర్వహిస్తున్న బౌద్ధ రోబో పూజారి!
టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించడంలో జపాన్ కు మరే దేశం సాటిరాదు. తాజాగా అక్కడి సైంటిస్టులు మరో ఆసక్తికర రోబోను తయారు చేశారు. దహన సంస్కారాలను నిర్వహించేందుకు బౌద్ధ మత పూజారి అందుబాటులో లేని ప్రాంతాల్లో... ప్రజల అవసరాలను తీర్చేందుకు ఓ రోబోను తయారు చేశారు. ఈ రోబో పూజారికి 'పెప్పర్' అనే పేరు పెట్టారు. అంత్యక్రియల సమయంలో డ్రమ్మును వాయించడమే కాకుండా, మంత్రాలను కూడా ఈ రోబో చదువుతుంది. ఆగస్ట్ 23న టోక్యోలో జరిగిన 'ది లైఫ్ ఎండింగ్ ఇండస్ట్రీ ఎక్స్ పో'లో ఈ రోబోను ప్రదర్శించారు. ఒక నిజమైన బౌద్ధ పూజారి ఒక అంతిమ సంస్కారాన్ని నిర్వహించేందుకు 2,200 డాలర్లను తీసుకుంటే, ఈ రోబో మాత్రం కేవలం 450 డాలర్లకే అన్ని పనులూ పూర్తి చేస్తుంది.