: 'ఇసుకేస్తే రాలనంత జనాన్ని చూడండి' అంటూ ఫోటో షేర్ చేసిన లాలూ ప్రసాద్ యాదవ్... ఇంత మోసమా? అంటూ నెటిజన్ల ఫైర్... నిజాన్ని చూడండి!
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. పలువురు రాజకీయ ఉద్ధండులు పాల్గొనగా, ఓ భారీ ర్యాలీని నిర్వహించిన లాలూ, అందుకు సంబంధించిన ఓ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని చెప్పుకుంటూ, "లాలూ 'బేస్' ముందు ఏ 'ఫేస్'కూడా నిలవదు. పట్నాలోని గాంధీ మైదానానికి వచ్చి కావాలంటే లెక్కించుకోండి" అని వ్యాఖ్యానించారు.
ఈ ఫోటోను పెట్టిన కాసేపటికే, అసలు ఫోటోలు ట్విట్టర్ లో దర్శనమివ్వడం గమనార్హం. అసలు ఫోటోను మార్ఫింగ్ చేసి అధికంగా ప్రజలు హాజరైనట్టు ఆయన చూపించారని, అందుకు ఫోటోషాప్ కు కృతజ్ఞతలు చెప్పుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందరికీ ఒకే విధమైన డ్రస్ కనిపిస్తోందని, ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందని సలహాలు ఇస్తున్నారు. ఇక లాలూ పోస్టు చేసిన ఫోటో, ఆసలు ర్యాలీకి హాజరైన ఫోటోలను మీరు చూడవచ్చు.
ఇది అసలు ఫోటో...
ఇది లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ట్వీట్...