: భరణంగా నెలకు రూ. నాలుగు లక్షలు... వ్యాపారవేత్తకు ఢిల్లీ కోర్టు ఆదేశం
భార్యను, మైనర్ కుమార్తెను వదిలేసినందుకు నెలకు రూ. నాలుగు లక్షలు భరణం ఇవ్వాలని ఓ వ్యాపారవేత్తను ఢిల్లీ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈ మొత్తాన్ని ఏడాదికి 15 శాతం పెంచాలని ఆదేశించింది. వెయ్యికోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన ఆ వ్యాపారవేత్త వార్షిక ఆదాయం పెరుగుతూ పోతుండటం వల్ల ఇలాంటి తీర్పునిచ్చినట్లు కోర్టు పేర్కొంది. 2008లో తనను వదిలేశారని, ప్రస్తుతం తనకు ఓ కూతురు ఉందని భర్త తరఫు నుంచి భరణం కావాలని మహిళ హైకోర్టులో పిటిషన్ వేసింది. తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. అక్కడ నుంచి 2014లో ఈ కేసును మేజిస్ట్రేట్ కోర్టుకే సుప్రీంకోర్టు తిప్పి పంపేసింది.