: పెగ్ తేవాలని ఏ మామను అడిగావు బాలయ్యా?: మోహన్ బాబు సూటి ప్రశ్న


తన కొత్త చిత్రం 'పైసా వసూల్'లో హీరో బాలకృష్ణ 'మామా ఏక్ పెగ్ లా...' అంటూ ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గత రాత్రి జరిగిన చిత్ర ఆడియో విజయోత్సవ వేడుకలో ప్రస్తావించిన నటుడు మోహన్ బాబు, ఏ మామను పెగ్గు తేవాలని అడిగారో తనకు తెలుసుకోవాలని ఉందని అన్నారు. ఆ మామ ఎవరో తనకు అర్థం కావడం లేదని, ఎందుకంటే, చంద్రబాబునాయుడికి మద్యం అలవాటు లేదని, ఇక అలా ఎందుకు పాడారో తెలుసుకోవాలని తనకెంతో ఆసక్తిగా ఉందని అన్నారు. ఇక ఓ పాటలో అన్న ఎన్టీఆర్ ను అనుకరిస్తూ బాలయ్య డ్యాన్స్ చేశాడన్న విషయం తనకు తెలిసిందని, ఆ పాటను, నృత్యాన్ని చూడాలని కూడా ఉందని అన్నారు. తనకు డ్యాన్స్ నచ్చకపోతే, వెంటనే బాలకృష్ణకు ఫోన్ చేసి చెప్పేస్తానని నిర్మొహమాటంగా చెప్పేశారు.

  • Loading...

More Telugu News