: తొలి రౌండ్ లో టీడీపీకి 1198 ఓట్ల ఆధిక్యం
నంద్యాల ఉపఎన్నిక లెక్కింపు కొనసాగుతోంది. నంద్యాల గ్రామీణ మండలం మొదటి రౌండ్ ముగిసేసరికి టీడీపీకి మొత్తం 5,477 ఓట్లు లభించాయి. వైసీపీకి 4,279, కాంగ్రెస్ కు 69, నోటాకు 80 ఓట్లు లభించాయి. కాగా, మొదటి రౌండ్ లో టీడీపీకి 1198 ఓట్ల ఆధిక్యం లభించినట్టయింది. కాగా, ఐదు రౌండ్ల వరకు నంద్యాల గ్రామీణ మండలం ఓట్లను లెక్కించనున్నారు.