: కాకినాడలో అభివృద్ధా?..పందులు దొర్లుతున్నాయి!: సీపీఐ నేత రామకృష్ణ


కాకినాడలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, పందులు దొర్లుతున్నాయని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడ అభివృద్ధే జరగలేదని, అటువంటిది అభివృద్ధి చూసి ఓటెయ్యాలని టీడీపీ నాయకులు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాకినాడలో జరిగేది ఎలక్షన్ కాదని, అధికార పార్టీ వేలం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతో ఉన్న అధికార టీడీపీ, వేలం తరహాలో ఓటర్లను, చిన్న నాయకులను కొనుగోలు చేసి విజయం సాధించాలని చూస్తోందని ఆరోపించారు. టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందని ఆరోపించిన రామకృష్ణ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు ప్రచార ఉద్యమం నిర్వహించనున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News