: మూడో వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక!
శ్రీలంక-భారత్ జట్ల మధ్య పల్లెకెలెలో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో శ్రీలంక టాస్ గెలవడం ఇదే తొలిసారి. ఇప్పటికే రెండు మ్యాచ్ లలో శ్రీలంకపై టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గెలిచేందుకు శ్రీలంక, వరుసగా మూడో మ్యాచ్ లో తమ సత్తా చాటి ఈ సిరీస్ ను కైవసం చేసుకునేందుకు టీమిండియా ఉవ్విళ్లూరుతున్నాయి.