raviteja: 'భోగన్' తెలుగు రీమేక్ లో రవితేజ!

షార్ట్స్‌లో చూడండి
రవితేజ కథానాయకుడిగా ప్రస్తుతం రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఒకటి 'రాజా ది గ్రేట్' అయితే .. రెండవది 'టచ్ చేసి చూడు'. ఈ రెండింటిలో 'రాజా ది గ్రేట్' విడుదలకి ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో రవితేజ 'భోగన్' అనే తమిళ సినిమాకి తెలుగు రీమేక్ లో చేయడానికి అంగీకరించినట్టు సమాచారం.

ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఈ సినిమా తమిళనాట విజయవిహారం చేసింది. జయం రవి .. అరవింద్ స్వామి ప్రధానమైన పాత్రలను పోషించారు. జయం రవి పాత్రను రవితేజ చేయనుండగా .. అరవింద్ స్వామి పాత్రను రోనిత్ రాయ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన లక్ష్మణ్ .. తెలుగు వెర్షన్ కి దర్శకత్వం వహించనున్నాడు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఈ కథను మార్చే బాధ్యత, దర్శకుడు పవన్ సాధినేనికి అప్పగించబడింది. ప్రస్తుతం ఆయన అదే పనిలో వున్నాడట.  
Go Back to Shorts
raviteja

More Telugu News