: రూ. 200 కోసం క్యూ కడుతున్న ప్రజలు!


రెండు రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలామణిలోకి తీసుకు వచ్చిన కొత్త రూ. 200 నోట్ల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. ఈ నోట్లను ప్రస్తుతానికి కేవలం రిజర్వ్ బ్యాంకు కార్యాలయాల నుంచి మాత్రమే అందిస్తుండగా, వాటిని సొంతం చేసుకుని చిల్లర కష్టాలను తీర్చుకునేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. నోట్ల రద్దు తరువాత రూ. 1000 నోట్లు కనుమరుగు కాగా, ఆ స్థానంలో రూ. 2 వేల నోట్లు మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రజలు డబ్బు మార్చుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, కొత్తగా వచ్చిన రూ. 200తో ఈ కష్టాలు తీరుతాయని కేంద్రం భావిస్తోంది. ఈ నోట్లను ఏటీఎంల ద్వారా అందించాలన్న ఉద్దేశం తమకు లేదని ఇప్పటికే ఆర్బీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో, ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాలు, ఆపై తదుపరి వారం నుంచి బ్యాంకుల ద్వారా ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఈ నోట్లను పెద్దఎత్తున చలామణిలోకి తీసుకురావాలని భావిస్తున్న కేంద్రం, భద్రతా ఫీచర్లను పెంచి సరికొత్త రూ. 50 నోటును కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News