: రేపు ఉదయం 10.30కే నంద్యాల ఫలితం!

గత వారంలో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల ఫలితం రేపు ఉదయం 10.30 గంటల్లోగానే వెల్లడి కానుంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుండగా, ఆందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించే సిబ్బంది ఆపై ఈవీఎంలను తెరవనున్నారు. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు సాగనుండగా, ఒక్కో రౌండ్ 10 నిమిషాల్లోనే ముగుస్తుంది. ఒక్కో రౌండ్ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లపై 14 ఈవీఎంలను అధికారులు తెరవనున్నారు. ఉదయం 9.30 గంటలకే ఫలితాల సరళి వెలువడుతుందని, అపై మరో గంటలోపే తుది ఫలితం వెల్లడి కావచ్చని అంచనా.

More Telugu News