hebah patel: విజయ్ సరసన ఛాన్స్... హెబ్బా పటేల్ దశ తిరిగినట్టే!

యూత్ లో క్రేజ్ ను సంపాదించుకుంటూ హెబ్బా పటేల్ తనదైన శైలిలో దూసుకుపోతోంది. రాజ్ తరుణ్ .. ఇప్పటివరకు నిఖిల్ వంటి కథానాయకులతో చేస్తూ వస్తోన్న హెబ్బా పటేల్, తాజాగా ఏకంగా తమిళ అగ్రకథానాయకుడు విజయ్ సరసన ఛాన్స్ కొట్టేసిందనే వార్త ఇప్పుడు అంతటా షికారు చేస్తోంది.

ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ 'మెర్సల్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉంటారట. వారిలో ఒక కథానాయికగా హెబ్బా పటేల్ ను తీసుకున్నారని అంటున్నారు. ఈ సినిమాతో ఆమె దశ తిరిగిపోయినట్టేననే టాక్ వినిపిస్తోంది.         
hebah patel

More Telugu News