: షర్ట్‌లెస్ సెల్ఫీ షేర్ చేసిన యువరాజ్... భజ్జీ, రోహిత్‌ల ఫన్నీ కామెంట్లు
క్రికెటర్ యువరాజ్ షర్ట్‌లెస్ సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇంకేముంది... రకరకాల ఫన్నీ కామెంట్లు వెల్లువలా వచ్చాయి. వారిలో ముఖ్యంగా తన స్నేహితులు హర్భజన్ సింగ్, రోహిత్ శర్మలు చేసిన కామెంట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. `సల్లూ భాయ్` అంటూ భజ్జీ కామెంట్ చేయగా, `మూడ్ అన్నావ్! ఎలాంటి మూడ్ అనేది సరిగా చెప్పలేదు.. ఇంతకీ ఏ మూడ్?` అంటూ రోహిత్ కామెంట్ చేశాడు. యువరాజ్ ఫొటోకన్నా వీరిద్దరూ చేసిన కామెంట్లకే నెటిజన్లు ఫిదా అయ్యారు. వారి మధ్య స్నేహం ఎంతలా ఉందనేది ఈ కామెంట్ల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ ఫొటోను లక్షన్నర మందికి పైగా నెటిజన్లు లైక్ చేశారు.