: రిలయన్స్ జియో 4జీ ఫోన్‌ కు అనూహ్య స్పందన... బుకింగ్స్ కి బ్రేక్!


టెలికాం మార్కెట్లో సంచ‌ల‌నం సృష్టించిన‌ రిలయన్స్‌ జియో ఈ నెల 24న సాయంత్రం 5.30 నుంచి త‌న 4జీ ఫోన్ కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్స్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ ఫోన్‌కి ఎన‌లేని స్పంద‌న రావ‌డంతో ఆ స‌మ‌యంలో జియో.కామ్ వెబ్‌సైట్ క్రాష్ కూడా అయింది. అనంత‌రం ఓపెన్ అయిన ఈ వెబ్‌సైట్ ద్వారా ఒక్క‌రోజులోనే ఏకంగా 30 ల‌క్ష‌ల మంది ఈ ఫోన్‌ను బుక్ చేసుకున్నార‌ట‌.

తాజాగా ఆ కంపెనీ ప్ర‌తినిధులు ఓ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ఫోన్ల‌ను ఇప్ప‌టికే లక్ష‌ల మంది బుక్‌ చేసుకున్నారని, ఈ ఫోన్‌ ప్రీ-బుకింగ్స్‌ను నిలిపివేస్తున్నామ‌ని చెప్పారు. మొత్తం 36 గంటలు మాత్రమే ఈ ఫోన్ల‌ బుకింగ్స్ జ‌రిగాయి. జియో ఫోన్‌ల‌ను బుకింగ్ చేసుకున్న‌ వినియోగ‌దారులు వ‌చ్చేనెల నుంచి వాటిని అందుకుంటారు.  

  • Loading...

More Telugu News