chiranjeevi: 'సైరా నరసింహా రెడ్డి'లో అనుష్క కూడా?

చిరంజీవి హీరోగా చారిత్రక నేపథ్యంలో 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలకు అవకాశం వున్నట్టుగా సమాచారం. అందులో ఒక కథానాయికగా నయనతారను ఎంపిక చేసుకున్నారు. మిగతా రెండు కథానాయిక పాత్రలలో ఒక పాత్ర కోసం ఐశ్వర్య రాయ్ ను సంప్రదించినట్టు సమాచారం. ఇక మరో కథానాయికగా అనుష్కను తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

గతంలో 'స్టాలిన్' సినిమా కోసం చిరంజీవి సరసన అనుష్క ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తరువాత చిరూ 150వ సినిమా సమయంలోను ఆమెను సంప్రదించారు. అప్పుడు వేరే కమిట్మెంట్స్ వలన ఆ ఛాన్స్ వదులుకున్న అనుష్క, 'సైరా నరసింహా రెడ్డి'లో అవకాశాన్ని వదులుకోకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  
chiranjeevi
nayatara
anushka

More Telugu News