: కాకినాడ ఎన్నికలు పూర్తయ్యే వరకు నంద్యాల ఎన్నిక ఫలితాన్ని వాయిదా వేయాలి!: పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి
కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో నంద్యాల ఉపఎన్నిక ఫలితాన్ని వాయిదా వేయాలని పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. నంద్యాల ఫలితం కార్పోరేషన్ ఎన్నికలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని, ఈ కారణంగా కాకినాడ ఎన్నికలు పూర్తయిన తర్వాతే నంద్యాల ఫలితాన్ని వెల్లడించాలని రఘువీరా అన్నారు. ఇదిలా ఉండగా, కాకినాడలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు స్థానిక కాపు వర్గంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే నంద్యాలలో టీడీపీ గెలుస్తుందని లగడపాటి సర్వే వెల్లడించిన విషయాన్ని టీడీపీ నేతలు ప్రచారంలో అస్త్రంగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.