venkatesh: గుణశేఖర్ పౌరాణిక చిత్రంలో వెంకటేశ్?

షార్ట్స్‌లో చూడండి
చారిత్రక నేపథ్యాన్ని కలిగిన 'రుద్రమదేవి'ని తెరకెక్కించి మెప్పించిన గుణశేఖర్, ఈ సారి పౌరాణిక నేపథ్యాన్ని కలిగిన చిత్రాన్ని తెరకెక్కించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. హిరణ్య కశిపుడు - భక్త ప్రహ్లాదుడికి సంబంధించిన కథా వస్తువును ఆయన ఎంచుకున్నాడు. ఈ సినిమాకి 'హిరణ్య కశిప' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నాడు.

 'హిరణ్య కశిపుడు'గా ఒక స్టార్ హీరోను ఎంపిక చేసుకోనున్నట్టు ఈ మధ్య గుణశేఖర్ చెప్పారు. రీసెంట్ గా ఆయన వెంకటేశ్ ను కలిసి కథను వినిపించినట్టు సమాచారం. వెంకటేశ్ తన కెరియర్లో ఇంతవరకూ పౌరాణిక పాత్రలను చేయలేదు. అందువలన కొత్తగా ట్రై చేసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన పాజిటివ్ గా స్పందించాడని అంటున్నారు. మిగతా నటీనటుల ఎంపిక పనుల్లో గుణశేఖర్ బిజీగా వున్నాడట. త్వరలోనే ఆయన పూర్తి వివరాలను ప్రకటించే ఛాన్స్ వుంది.  
Go Back to Shorts
venkatesh

More Telugu News