vijay devarakonda: తెలంగాణ తొలి మెగాస్టార్ విజయ్ దేవరకొండ : రామ్ గోపాల్ వర్మ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో .. ఎప్పుడు ఎవరిని విమర్శిస్తాడో ఎవరికీ తెలియదు. అయితే విమర్శలైనా .. పొగడ్తలైనా ఒక రేంజ్ లో ఉంటాయి. తాజాగా హీరో విజయ్ దేవరకొండను పొగిడేసి మరోసారి తన ధోరణిని స్పష్టం చేశాడు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా చేసిన 'అర్జున్ రెడ్డి' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా చూసిన వర్మ తనదైన శైలిలో స్పందించాడు.

ఈ తరం హీరోలంతా తమ హీరోయిజాన్ని చూపించడానికి సాంకేతికతపై ఆధారపడుతున్నారనీ, అందుకు భిన్నంగా విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చాడని ఆయన అన్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అమితాబ్ లా మారతాడనీ, తెలంగాణలో తొలి మెగాస్టార్ గా కొనసాగుతాడని ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ పొగడ్తలు ఆ యంగ్ హీరోపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఏమో!   
vijay devarakonda
shalini

More Telugu News