: మరోమారు కండకావరం ప్రదర్శించిన చైనా.. త్రివర్ణ పతాకాన్ని ఘోరంగా అవమానించిన డ్రాగన్ కంట్రీ
భారత్‌పై చైనా మరోమారు తన అక్కసును వెళ్లగక్కింది. క్షమించరాని తప్పు చేస్తూ కండకావరం ప్రదర్శించింది. బూట్ల డబ్బాలపై త్రివర్ణ పతాకాన్ని ముద్రించి భారత్‌ను ఘోరంగా అవమానించింది. డోక్లాం వివాదం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారత్‌ను మరింత రెచ్చగొట్టేందుకే చైనా ఈ పని చేసినట్టు చెబుతున్నారు. బూట్ల పెట్టెల పై భాగంలో మూడు రంగుల జెండాను ముద్రించిన చైనా అడుగున మాండరిన్ భాషలో కొన్ని పదాలను ముద్రించింది.
ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఓ దుకాణదారుడి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగుచూసింది. ఫిర్యాదుతో కదిలిన అల్మోరా సీనియర్ సూపరింటెండెంట్ రేణుకా దేవి బూట్లు సరఫరా చేసిన రుద్రపూర్‌లోని తమ్మన ట్రేడర్స్ యాజమాన్యాన్ని ప్రశ్నించినట్టు తెలిపారు. ఆ బూట్లు ఢిల్లీలోని ఓ సరఫరాదారు నుంచి వచ్చాయని వారు చెప్పడంతో త్వరలోనే వారిని గుర్తించి వివరాలు ఆరా తీయనున్నట్టు పోలీసులు తెలిపారు.