: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పీవీ సింధుకు పతకం ఖాయం
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సిరీస్‌లో భారత స్టార్ ప్లేయర్, హైదరాబాదీ పీవీ సింధుకు పతకం ఖాయం అయింది. ఈ రోజు జరిగిన క్వార్టర్ ఫైన్‌ల్‌లో చైనా షట్లర్ సన్ యూపై విజయం సాధించిన సింధు సెమీస్‌లోకి అడుగుపెట్టింది. సన్ యూపై మొదటి నుంచి ధాటిగా ఆడిన సింధు 21-14, 21-9 తేడాతో గెలుపొందింది. సింధు విజయంపై భారత బ్యాట్మింటన్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తూ, ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది.