: వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి రూపంలో గణేశుడి విగ్రహం... మెచ్చుకుంటున్న నెటిజన్లు
మంచి పనితీరు కనబరిస్తే అధికారులను ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజిస్తారని చెప్పడానికి మరో నిదర్శనం దొరికింది. తన పనితీరు, ప్రవర్తనతో ఆకట్టుకునే వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి మీద తమకున్న అభిమానాన్ని ఖాజీపేట యువత వినూత్నంగా చాటుకున్నారు. వినాయక చవితి సందర్భంగా ఆమ్రపాలి తల్లిగా మారి, వినాయకుణ్ని ఒడిలో కూర్చోబెట్టుకున్నట్లుగా ఉన్న విగ్రహాన్ని బాపూజీ నగర్ యువత తమ మండపంలో ప్రతిష్టించారు. వీరి సృజనాత్మకతను ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు. ఆమ్రపాలి విగ్రహం ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు కూడా లైక్‌లు, షేర్లు చేస్తున్నారు.