: భారత్ వాదన అర్థవంతమైందేనంటూ పాక్‌ను హెచ్చరించిన అమెరికా
ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ భారత్‌పై దాడులకు దిగుతున్న పాకిస్థాన్ తీరుపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశంలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను అణచివేయాలని పాక్‌కు అమెరికా సూచించింది. భారత్, పాకిస్థాన్ చర్చల ద్వారా ఉద్రిక్తతలకు ముగింపు పలకాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలసీపై మీడియా వివరణ కోరగా వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇరు దేశాలు తమ మధ్య ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు.
ఓ వైపు దాడులు జరుగుతుంటే మరోవైపు చర్చలు జరపలేమన్న భారత్ వాదన అర్థవంతమైనదేనని ఆయన పేర్కొన్నారు. భారత్‌లోని ముంబయి, పఠాన్‌కోట్ వంటి ప్రాంతాల్లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులపై చర్యలు చేపట్టాలని పాక్‌ను కోరామని అన్నారు.