: ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజ.. పాల్గొన్న ప్రముఖులు
హైదరాబాద్, ఖైరతాబాద్‌లోని 57 అడుగుల ఎత్తులో కొలువుదీరిన శ్రీ చండీకుమార అనంత మహాగణపతికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు తొలిపూజ నిర్వహించారు. గవర్నర్ దంపతులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. అనంతరం గవర్నర్ దంపతులు పార్వతీ పుత్రుడికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఏకదంతుడిని చూసేందుకు భక్తులు పోటెత్తారు.