: ధాటిగా ఆడుతున్న డిక్ వెల్లా వికెట్ పడగొట్టిన బుమ్రా
భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో 41 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ డిక్ వెల్లాను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ అయిన డిక్ వెల్లాకు బుమ్రా స్లో డెలివరీని సంధించాడు. ఆ బంతిని కొంచెం ముందుగానే ఆడటంతో మిడ్ వికెట్ లో ఉన్న ధావన్ కు డిక్ వెల్లా ఈజీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మొత్తం 24 బంతులను ఎదుర్కొన్న డిక్ వెల్లా 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ గుణతిలక 10 పరుగులతో ఆడుతున్నాడు. కుశాల్ మెండిస్ వన్ డౌన్ లో బరిలోకి దిగాడు.