vijay devarakonda: నెక్స్ట్ మూవీ స్టార్ హీరోతో ఉండొచ్చు : 'అర్జున్ రెడ్డి' దర్శకుడు

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన 'అర్జున్ రెడ్డి' .. రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విజయ్ దేవరకొండ .. షాలిని పాండే జంటగా తెరకెక్కిన ఈ సినిమా గురించి సందీప్ రెడ్డి మాట్లాడాడు. ఇది యూత్ కి కనెక్ట్ అయ్యే ప్రేమకథాంశమని అన్నాడు. తన చుట్టూ జరుగుతోన్న సంఘటనల నుంచి .. లవ్ లో ఫెయిలైన తన అనుభవాలను ఆధారం చేసుకుని ఈ సినిమాకి కథను రెడీ చేసుకున్నానని చెప్పాడు.

ఈ సినిమా పోస్టర్  వివాదాలకు దారితీస్తుందని తాను అనుకోలేదనీ, సెన్సార్ వారు సూచించిన డైలాగ్స్ ను మ్యూట్ చేశామని అన్నాడు. ఆల్రెడీ తన దగ్గర రెండు కథలు సిద్ధంగా ఉన్నాయనీ, నెక్స్ట్ మూవీ స్టార్ హీరోతో చేసే అవకాశం ఉందని చెప్పాడు. 'అర్జున్ రెడ్డి' రిజల్ట్ చూసుకుని నెక్స్ట్ మూవీకి సంబంధించిన పనులను మొదలుపెడతానని చెప్పుకొచ్చాడు.    
vijay devarakonda
shalini

More Telugu News