: ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. 25వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు... ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన చెప్పారు. వాహనదారులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని... ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్తూ, పోలీసులకు సహకరించాలని కోరారు.
ట్రాఫిక్ మళ్లింపు ఈ విధంగా ఉంటుంది...
- మింట్ కాంపౌండ్ లైన్ నుంచి నెక్లెస్ రోడ్డు రోటరీ నుంచి ఖైరతాబాద్ లైబ్రరీ వైపు వాహనాలకు అనుమతి ఉండదు. ఖైరతాబాద్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఈ వాహనాలను దారి మళ్లిస్తారు.
- రాజ్ దూత్ హోటల్ లైన్, ఖైరతాబాద్ మార్కెట్ వైపు నుంచి లైబ్రరీ వైపు వచ్చే వాహనాలకు కూడా అనుమతి లేదు. లైబ్రరీకి వెనుక వైపున ఉన్న ఎంసీహెచ్ శానిటరీ వార్డు కార్యాలయం వైపు నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
- రాజీవ్ గాంధీ విగ్రహం వైపు నుంచి ఖైరతాబాద్ లైబ్రరీ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలు నిరంకారి వైపు నుంచి వెళ్లాలి.