: హ్యాష్‌ట్యాగ్ కు ప‌దేళ్లు.. ఇది ఎలా మొదలైందో తెలుసా?


సోష‌ల్ మీడియా అకౌంట్లు ఉన్న‌వారికి హ్యాష్‌ట్యాగ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. ఏదైనా అంశాన్ని ప్ర‌త్యేకంగా చూపించేందుకు నెటిజ‌న్లు హ్యాష్‌ట్యాగ్‌ను ఉప‌యోగిస్తుంటారు. ఇలా వాడ‌కంలో హ్యాష్‌ట్యాగ్ ఇప్ప‌టికి ప‌దేళ్లు పూర్తి చేసుకుంది. అమెరికాలోని సామాజిక మాధ్యమాల నిపుణుడు క్రిస్‌ మెస్సినా దీన్ని మొద‌టగా ఉప‌యోగించారు. ట్వీట్లలో # సంకేతంతో సంబంధిత అంశాన్ని పేర్కొనడం వ‌ల్ల, అంశాలవారీగా వాటిని గుర్తించే వీలుంటుంద‌ని మెస్సినా ప్రతిపాదించారు.

అందుకు ఉదాహ‌ర‌ణగా ఆయ‌న సాంకేతిక సదస్సులను గుర్తించేందుకు.. # బార్‌క్యాంప్‌ పేరుతో 2007, ఆగస్టు 23న ట్వీట్ చేశారు. అదే హ్యాష్‌ట్యాగ్‌తో ఉన్న‌ తొలి ట్వీట్‌. ఇక అప్పటి నుంచి ప్రపంచంలో జ‌రుగుతున్న ముఖ్య‌మైన సంఘ‌ట‌న‌ల‌న్నింటినీ నెటిజ‌న్లు హ్యాష్‌ట్యాగ్ చేస్తున్నారు. హ్యాష్‌ట్యాగ్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా ఆ అంశంతో చేసిన ట్వీట్ల‌న్నింటినీ చూడొచ్చు. ట్విట్ట‌ర్‌తో పాటు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టంబ్లర్‌ లాంటి ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ హ్యాష్‌ట్యాగ్ సౌక‌ర్యం ఉంది. ప్రస్తుతం ప్ర‌తిరోజూ హ్యాష్‌ట్యాగ్‌లతో చేస్తున్న పోస్ట్‌ల సంఖ్య 12.5 కోట్లకు పైనే ఉందంటే ఈ హ్యాష్‌ట్యాగ్ ఎంత‌గా ఆద‌ర‌ణ పొందిందో అర్థం చేసుకోవ‌చ్చు.

  • Loading...

More Telugu News