: సిగ్గున్నదరా భయ్... నువ్వసలు దర్శకునివేనా?: రాంగోపాల్ వర్మపై వీహెచ్ ఫైర్


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, "సిగ్గున్నదరా భయ్... నువ్వసలు దర్శకునివేనా?... సమాజానికి ఇట్లాంటివి చెబుతావా? తాతయ్య మనవడి దగ్గరకు వెళ్లి, బాబూ ముద్దెట్ల బెడతవురా? అని నేర్చుకోవాలా? తాతయ్యకు తెలియదరా భయ్.. సినిమాలు అమ్ముకోవడమే లక్ష్యమా? సమాజం, విలువలు, సంస్కారం వంటివి లేవా? పనిలేక ఇలాంటివన్నీ చెబుతున్నవా? మంచి సినిమాలు తీసి సమాజ ఉన్నతికి పాటుపడాలి కానీ, ఇలాంటివి సమర్థిస్తవా?" అని తీవ్రంగా మందలించారు.

నీకు సినిమాలు తియ్యనికి చేతకాకపోతే గమ్మున కూర్చోవాలని ఆయన సూచించారు. పని లేక ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇలాంటి వైఖరిని సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని సూచించారు. అలా చేయకపోతే విశృంఖల విధానాలకు చొరవచూపుతారని, మనసమాజాన్ని మనమే బాగుచేసుకోవాలని ఆయన హితవు పలికారు. ఇలాంటి వారికి ప్రతి ఒక్కరూ బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. 

  • Loading...

More Telugu News