: తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని గగ్గోలు పెడుతున్న చైనా...ఉత్తరకొరియాపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్!
ఉత్తరకొరియాకు ఎగుమతులపై ఐక్యరాజ్యసమితి విధించిన అంక్షలు ఎత్తివేయాలని చైనా డిమాండ్ చేస్తోంది. ఐక్యరాజ్యసమితి ద్వారా ఆ దేశంపై ఆంక్షలు విధించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన అమెరికా చర్య వల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందని చైనా గుండెలు బాదుకుంటోంది. ఈ ఆంక్షల కారణంగా ఉత్తర కొరియాకు ఇతర దేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఉత్తరకొరియాలో భారీ ఎత్తున వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న చైనా, తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని గగ్గోలు పెడుతోంది.
తమకు ఆర్థిక నష్టం వాటిల్లుతోందని చైనా వాపోతోంది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలపై పునరాలోచించాలని చైనా డిమాండ్ చేస్తోంది. ఉత్తరకొరియాలో పెట్టిన పలు కంపెనీల పెట్టుబడులు ఈ ఆంక్షల వల్ల వెనక్కి రావని చైనా వాపోతోంది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా లేమని చైనా చెబుతోంది. అమెరికా సానుకూలంగా ఆలోచించాలని చైనా సూచిస్తోంది. దీనిపై అమెరికా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రే టెల్లర్సన్ మండిపడుతున్నారు. చైనా ఇలా అమెరికాపై ఎదురుదాడి చేయడం ఎంత మాత్రం సబబు కాదని అన్నారు. అమెరికా ప్రభుత్వ కార్యదర్శి రేటెల్లర్సన్ చైనా తీరును తప్పుపడుతున్నారు.